'బరాబర్ ప్రేమిస్తా' హీరోపై కేసు నమోదు
హైదరాబాద్: టీవీ నటుడు ప్రభాకర్ కుమారుడైన సినీ హీరో చంద్రహాస్‌పై మాదాపూర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. చంద్రహాస్ హీరోగా నటించిన ‘బరాబర్ ప్రేమిస్తా’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఇటీవల నగరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రహాస్ వేదికపై ఒక పాట పాడారు. చంద్రహాస్ ఉపయోగించిన భాష సరికాదంటూ బిగ్ టీవీ జర్నలిస్టుగా పనిచేస్తున్న అశోక్‌కుమార్ ఓ వీడియో విడుదల చేశారు. దీనికి స్పందనగా చంద్రహాస్ చేసిన వీడియోలో తనను బెదిరించారని అశోక్‌కుమార్ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Login
Comments (0)