విశాఖపట్నం: నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఉదయం 5.08 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. గాజువాక, మంగళపాలెం, పెదవాల్తేరు, ఆరిలోవ, ఎంవీపీ అప్పుఘర్ ప్రాంతాల్లో ప్రకంపనలు కనిపించాయి. కాకినాడకు 225 కి.మీ దూరంలో బంగాళాఖాతంలో 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Don’t receive OTP? Resend