మంగళగిరిలో నూతన లూధరన్ చర్చిని ప్రారంభించిన లోకేష్
మంగళగిరి: ఆత్మకూరులో ఆంధ్ర ఇవాంజిలికల్ లూథరన్ సంఘం(AELC) ఆత్మకూరు ప్యారిష్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన లూథరన్ చర్చి ప్రతిష్ట మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి నూతన చర్చిని ప్రారంభించారు. శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. లూథరన్ చర్చి ప్రతిష్ట మహోత్సవాన్ని పురస్కరించుకుని మొక్కను నాటారు. ఈ సందర్భంగా చర్చి పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ఈ మందిరం పునర్ నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యే అవకాశం దేవుడు కల్పించాడు, చర్చి నిర్మాణాన్ని ఏడాదిలో పూర్తిచేయాలని చెప్పాను, పునర్ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో అద్భుతంగా మందిరాన్ని నిర్మించారు అని అన్నారు.
Login
Comments (0)