దాల్మియా ప్లాంట్ విస్తరణకు లోకేశ్ శ్రీకారం
కడప: మైలవరం మండలం చిన్నకొమెర్ల సమీపంలో దాల్మియా సిమెంట్ రెండో ప్లాంట్ విస్తరణ పనులకు మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు. రూ.3,100 కోట్లతో చేపట్టనున్న ఈ విస్తరణ ప్రాజెక్టు ద్వారా మరో 700 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. పరిశ్రమల విస్తరణతో కడప జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని అధికారులు తెలిపారు.
Login
Comments (0)