అప్పలరాజు అరెస్ట్‌పై జగన్ ఆగ్రహం
వైసిపి నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్టుపై వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాద ఘటనను కక్షసాధింపునకు ఉపయోగిస్తున్నారని, అప్పలరాజు కుమారుడిపై హత్యానేరం మోపి అరెస్టు చేయడం, అనంతరం అప్పలరాజును అరెస్టు చేయడం రాజకీయ వేధింపులేనని ఆరోపించారు. అరెస్టులతో వైసిపిని భయపెట్టలేరని, ప్రజల కోసం పోరాడే వారికి తమ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.
Login
Comments (0)