ఏపిలో మొదలైన ఇంటర్మీడియట్ పరీక్షలు
ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. విద్యార్థులు వారికి కేటాయించిన పరీక్షా కేంద్రాలకు ఉదయాన్నే చేరుకున్నారు. దీంతో సందడి వాతావరణం నెలకొంది. పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థులను ఆయా కళాశాలల సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతున్నాయి. దాదాపు 10.57 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు.
Login
Comments (0)