సైకిల్‌పై ఇంటింటికీ తిరుగుతూ డెలివరీలు చేస్తున్న ఓ గిగ్ వర్కర్‌కు అనంత్ అంబానీ తరఫున ఊహించని కానుక లభించింది. బైక్ కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత లేని ఆ డెలివరీ ఏజెంట్‌కు ప్రతినిధులు ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బహుమతిగా అందజేశారు. ఈ క్రమంలో తీవ్ర భావోద్వేగానికి గురైన ఆ డెలివరీ ఏజెంట్ కంటతడి పెట్టారు.
ముంబయికి చెందిన హుస్సేన్ మన్సూరి అనే ఇన్ఫ్లుయెన్సర్ దీనికి సంబంధించి ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా అది వైరల్‌గా మారింది. ముంబయిలో డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తున్న సుజీత్ అనే వ్యక్తి సైకిల్‌పై విధులకు వెళ్తుండగా రోడ్డుపై హుస్సేన్ మన్సూరి ఆయన్ను పలకరించారు. బైక్ ఎందుకు కొనుక్కోలేదని ప్రశ్నించగా చాలీచాలనీ వేతనంతో బండి కొనుగోలు చేసే శక్తి లేదని ఆయన తెలిపారు.
అయితే నీకో సర్ప్రైజ్ ఇస్తానని చెప్పిన హుస్సేన్ డెలివరీ పూర్తి చేసి తిరిగి రావాలని సూచించారు. తిరిగి వచ్చిన సుజీత్ కళ్లకు గంతలు కట్టి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సర్ప్రైజ్గా ఇచ్చారు. అనంత్ అంబానీ తరఫున చిన్న బహుమతి అని తెలపడంతో సుజీత్ ఆనందంతో ఉప్పొంగిపోయారు. అనంత్ సేవా ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఈ బహుమతిని అందజేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
Don’t receive OTP? Resend