గాయంతో వైదొలగిన యమగుచి, సెమీస్‌కు పీవీ సింధు
డెస్క్: కౌలాలంపుర్ వేదికగా జరుగుతున్న మలేసియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 బాడ్మింటన్ టోర్నమెంట్లో పీవీ సింధు సెమీఫైనల్‌కు చేరుకుంది. ఆమె ప్రత్యర్థి జపాన్‌కు చెందిన అకానే యమగుచి గాయం వల్ల క్వార్టర్ ఫైనల్ నుంచి వైదొలిగింది. ఆమె ఆట నుంచి తప్పుకోవడానికి ముందు సింధు 21-11తో ప్రారంభ గేమ్‌ను గెలుచుకుంది. గాయం తర్వాత సింధు తొలిసారిగా ఈ టోర్నమెంట్లో పోటీపడుతోంది.
Login
Comments (0)