అమెరికాలో పర్యటనకు వెళ్లిన అద్దంకి విద్యార్థి అదృశ్యం
అద్దంకి: ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన కరసాని హరి అమెరికాలో అదృశ్యమయ్యాడు. హ్యూస్టన్‌లో నివసిస్తున్న హరి క్రిస్మస్ సెలవుల సందర్భంగా డిసెంబర్ 22న ఒంటరిగా అలాస్కాకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో వెళ్లాడు. డెనాలి సమీపంలోని హోటల్లో బస చేసిన అతడు జనవరి 3–4లో తిరిగి వస్తానని తెలిపాడు. డిసెంబర్ 30న చివరిసారిగా కుటుంబంతో మాట్లాడాడు. 31న హోటల్ నుంచి బయటకు వెళ్లిన అనంతరం క్యాబ్ ఉపయోగించినట్లు సమాచారం. అప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.
Login
Comments (0)