నాగార్జున వర్శిటి ఇంజనీరింగ్ కాలేజికి వైఎస్ పేరు తొలగింపు
మంగళగిరి: నాగార్జున యూనివర్శిటిలోని ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల భవనంపై ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును అధికారులు తొలగించారు. టీఎన్ఎస్ఎఫ్ నాయకులు కోరిన వెంటనే గురువారం క్రేన్‌ను రప్పించి ఇంజినీరింగ్ కళాశాలపై ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును తొలగించారని వైసిపి విద్యార్థి విభాగం నాయకులు విమర్శించారు. సిఎంగా ఉండి ప్రమాదవశాత్తు మరణించిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలకు 2009లో పెట్టారు.
Login
Comments (0)