అదానీ మీద కేసు ఉపసంహరణకి రంగం సిద్ధం; జగన్ కీ రిలీఫ్
అమెరికా దర్యాప్తు సంస్థలు అదానీ మీద పెట్టిన కేసుని ఉపసంహరించుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి అని అమెరికన్ మీడియాలో తాజాగా సంచలన కథనాలు వచ్చాయి. న్యూయార్క్ టైమ్స్ రిపోర్టు ప్రకారం, సెకి విద్యుత్ కొనుగోళ్లలో జగన్ సిఎంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 1750 కోట్లు లంచం ఇచ్చారని అమెరికా దర్యాప్తు సంస్థలు కేసు పెట్టాయి. గతంలో ట్రంప్ కి పనిచేసిన లాయర్ మధ్యవర్తిత్వంలో ఈ కేసుని అమెరికా ప్రభుత్వం విత్ డ్రా చేసుకోటానికి సిద్ధపడుతోందని సమాచారం. దీనివల్ల జగన్ కి కూడా రిలీఫ్ దక్కినట్టే. ఆయన పేరు ఈ కేసులో ఎక్కడా లేకపోయినా, అమెరికన్ కోర్టులో విచారణ జరిగివుంటే, ఎవరికి ఈ లంచం ఇచ్చారు అనే విషయాన్ని ఎఫ్ బి ఐ బయటపెట్టి ఉండాల్సి వచ్చేది.
Login
Comments (0)