కొత్త ఉద్యోగానికి ముందే తెలుగు యువకుడి మృతి
విజయవాడ: అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రంలో స్కైడైవింగ్ ప్రమాదంలో విజయవాడకు చెందిన మణిచంద్ర తేజ గడ్డం (28) మృతి చెందారు. కొత్త ఉద్యోగంలో చేరడానికి ఒక్క రోజు ముందే ఈ విషాదం చోటుచేసుకుంది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తేజ ఎంఎస్ పూర్తి చేసి ఇటీవల కొత్త ఉద్యోగం పొందారు. ఆయన చదువుకోసం తీసుకున్న రూ.50 లక్షల విద్యా రుణం ఇంకా తీరకముందే ఈ ప్రమాదం జరగడంతో కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
Login
Comments (0)