జెఈఈ మెయిన్ ఫలితాల్లో వంద శాతం సాధించిన తెలుగు విద్యార్థులు
హైదరాబాద్: జేఈఈ మెయిన్-2026 తొలి విడత ఫలితాల్లో వంద పర్సంటైల్ సాధించిన 12 మందిలో ముగ్గురు తెలుగు రాష్ట్రాల వారే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి పసల మోహిత్, నరేంద్రబాబుగారి మహిత్, తెలంగాణ నుంచి ఎం.వివాన్ శరత్‌లు 100 పర్సంటైల్ సాధించిన వారిలో ఉన్నారు. ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీలలో 2026-27 విద్యా సంవత్సరంలో బీటెక్‌లో ప్రవేశాల కోసం జనవరి 21-28 తేదీల మధ్య జేఈఈ మెయిన్-2026 తొలి విడత పేపర్-1 పరీక్షలు జరిగాయి. మొత్తం 13.55 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. 13.04 లక్షల మంది పరీక్షలు రాశారు.
Login
Comments (0)