9వ తరగతిలో కొత్త భాష వద్దు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ త్రిభాషా విధానంలో భాగంగా తొమ్మిదో తరగతిలో కొత్త భాషను ప్రవేశపెట్టడం సరైన విధానం కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో విద్యార్థులపై అదనపు ఒత్తిడి పడుతుందని అభిప్రాయపడింది. కొత్త భాషను ఐదో లేదా ఆరో తరగతిలోనే ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. తమిళనాడులో జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
Login
Comments (0)