అమెరికా రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కందుల జాహ్నవికి 262 కోట్ల పరిహారం
అమెరికాలో పోలీస్ కారు ఢీకొని మృతి చెందిన కర్నూలు జిల్లాకు చెందిన 23ఏళ్ల కందుల జాహ్నవి కుటుంబానికి పరిహారం లభించింది. సియాటెల్ నగర యంత్రాంగం రూ.262 కోట్లను ఆమె మరణానికి పరిహారంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అమెరికాలో చదువుకుంటున్న జాహ్నవి 2023 జనవరిలో సియాటెల్‌లో రోడ్డు దాటుతుండగా పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొనడంతో చనిపోయింది. ఈ ప్రమాదంపై ఓ పోలీసు అధికారి హేళనగా మాట్లాడటం, ఆమె విలువను చులకన చేస్తూ వ్యాఖ్యానించిన వీడియో వైరలైంది.
Login
Comments (0)