యాంగోన్: మయన్మార్ నుంచి బయల్దేరిన రోహింగ్యా శరణార్థుల రెండు పడవలు బంగాళాఖాతంలో మునిగిపోవడంతో 500 మందికిపైగా ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని అంతర్జాతీయ వలసల సంస్థ (IOM), ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషనర్ (UNHCR) ఆందోళన వ్యక్తం చేశాయి. రెండు పడవల్లో కలిపి సుమారు 530 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిపాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం వారంతా మృతి చెందినట్లు భావిస్తున్నామని వెల్లడించాయి.
Don’t receive OTP? Resend