సీఎంతో వేదిక పంచుకున్న విద్యార్థిని బలవన్మరణం
అమరావతి: ఇటీవల మెగా పేరెంట్-టీచర్ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో వేదిక పంచుకుని ప్రసంగించిన పదో తరగతి విద్యార్థిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. పోలవరం జిల్లాలోని ఇర్లపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఘటనపై ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ పూర్తి స్థాయి విచారణకు అధికారులను ఆదేశించారు. పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Login
Comments (0)