నేడు మంగళగిరి స్టేషన్ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ.12.56 కోట్లతో పునర్వ్యవస్థీకరించిన ఆంధ్రప్రదేశ్ మంగళగిరి రైల్వే స్టేషన్ను ప్రధాని నరేంద్ర మోదీ నేడు వర్చువల్గా జాతికి అంకితం చేయనున్నారు. అమరావతికి కీలక అనుసంధాన కేంద్రంగా ఉన్న ఈ స్టేషన్లో రెండో ప్రవేశ భవనం, లిఫ్టులు, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు, ఆధునిక వేచి గదులు, విస్తరించిన ప్లాట్ఫారాలు, పార్కింగ్ తదితర సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.
Login
Comments (0)