పీలే జెర్సీ రూ.47 కోట్లకు విక్రయం
ఫుట్‌బాల్ దిగ్గజం పీలే 1958 ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో ధరించిన జెర్సీ వేలంలో రూ.47 కోట్లకు అమ్ముడైంది. ఆ ఫైనల్లో 17 ఏళ్ల పీలే రెండు గోల్స్ చేసి బ్రెజిల్‌కు 5-2తో టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించారు. ప్రపంచకప్ ఫైనల్లో అత్యంత పిన్న వయసులో గోల్ చేసిన ఆటగాడిగా ఆయన రికార్డు ఇప్పటికీ కొనసాగుతోంది. పీలే 2022లో మరణించారు.
Login
Comments (0)