తిరుమలలో తులసీ దళాలనే ప్రసాదంగా ఇవ్వాలి: సిబిఐ మాజీ డైరక్టర్
తిరుమల: అన్నదాన కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్న నేపథ్యంలో వండిన ప్రసాదాల పంపిణీ అవసరం లేదని సిబిఐ మాజీ డైరెక్టర్ మన్నెం నాగేశ్వరరావు అన్నారు. వైష్ణవ సంప్రదాయంలో తులసీకి విశేష పవిత్రత ఉందని, తులసీ దళాలను మాత్రమే ప్రసాదంగా ఇస్తే అవినీతి, కల్తీ, అపవిత్రతకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ అంశంపై తితిదే పాలక మండలి వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు.
Login
Comments (0)