టిటిడికి ఎలక్ట్రిక్ బస్సు అందజేసిన నీరా రాడియా
కమ్యూనికేషన్ కన్సల్టెంట్ నీరా రాడియా ఒక విద్యుత్ బస్సుతో పాటు15 యాపిల్ ట్యాబ్లను టిటిడికి అందజేశారు. శ్రీవారి ఆలయం ఎదుట విద్యుత్ బస్సుకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం బస్సు తాళం, ట్యాబ్లను తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరికి దాత అందించారు. తితిదేలో మొత్తం 20 ధర్మరథం బస్సులు ఉంటే, వాటిలో 14 విద్యుత్ బస్సులు ఉన్నాయని అదనపు వెంకయ్య చౌదరి తెలిపారు. నీరా రాడియా పేరు గతంలో రాడియా టేపుల పేరుతో టెలికాం వివాదంలో చోటు చేసుకుంది.
Login
Comments (2)
sanath kolluri
1 months agotest
sanath kolluri
1 months agotest