మే నెలలో హైదరాబాద్-విశాఖ కొత్త రోడ్డు, తగ్గనున్న 56 కిమీ దూరం
ఖమ్మం: తెలుగు రాష్ట్రాలను కలుపుతూ ఖమ్మం–దేవరపల్లి మధ్య నిర్మించిన తొలి యాక్సెస్ కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే మేలో ప్రారంభానికి సిద్ధమైంది. 162.04 కి.మీ. నాలుగు లేన్ల రహదారిలో సీసీ కెమెరాలు, సోలార్ ప్యానెల్లు, క్యూఆర్ కోడ్లు, ఆధునిక ట్రాఫిక్ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. దూరానికే టోల్, పరిమిత ఎంట్రీ–ఎగ్జిట్ పాయింట్లు ప్రత్యేకత. హైదరాబాద్–విశాఖ ప్రయాణం 56 కి.మీ. తగ్గనుంది. ఖమ్మం తల్లంపాడు నుంచి దేవరపల్లి వరకు ఎన్‌హెచ్-365బీజీగా గుర్తింపు పొందింది అధికారులు తెలిపారు అని సూచించారు.
ఈ రోడ్డు నిర్మాణానికి కేంద్రం రూ.4,451.87 కోట్లు ఖర్చు చేస్తోంది. తెలంగాణ పరిధిలోని ప్యాకేజీ-1లో ఒక వంతెన, ఆర్వోబీ నిర్మాణం (బో స్ట్రింగ్ గిడ్డర్) చివరి దశలో ఉండగా, మిగిలిన పనులు పూర్తయ్యాయి. ఈ మార్గంలో 10 పెద్ద వంతెనలు, 49 చిన్న వంతెనలు, 295 కల్వర్టులు, ఒక ఆర్వోబీ, 98 అండర్‌పాస్‌లు నిర్మించారు. ఖమ్మం జిల్లాలోని వందనం గ్రామం వద్ద ఈ రహదారి నుంచి నాగ్‌పుర్-అమరావతి హైవేకి కలిసేలా అనుసంధాన మార్గం కూడా నిర్మిస్తున్నారు.
Login
Comments (0)