దిల్లీ: నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రం లీకేజీ కేసులో రసాయన శాస్త్ర ప్రశ్నపత్రంలోని 111 ప్రశ్నలను రూ.5 లక్షలకు విక్రయించినట్లు ఆధారాలు లభించాయని సీబీఐ ప్రత్యేక కోర్టుకు తెలిపింది. ప్రశ్నపత్రాల రూపకల్పన కమిటీ సభ్యుడి నుంచి ప్రశ్నలు సేకరించినట్లు దర్యాప్తులో తేలిందని పేర్కొంది. ఈ కేసులో ఇప్పటివరకు 13 మందిని అరెస్టు చేయగా, వారంతా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారని వెల్లడించింది.
Don’t receive OTP? Resend