నారా లోకేశ్‌తో క్రికెటర్ జాంటీ రోడ్స్ భేటీ
రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌తో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, కోచ్ జాంటీ రోడ్స్ మంగళవారం భేటీ అయ్యారు. క్రీడలు, యువత అభివృద్ధి, ప్రతిభను ప్రోత్సహించే అవకాశాలపై ఇద్దరూ సుదీర్ఘంగా చర్చించారు. ప్రపంచవ్యాప్తంగా క్రీడాకారులకు రోడ్స్ స్ఫూర్తిగా నిలిచారని లోకేశ్ కొనియాడారు. ఈ సందర్భంగా తన సంతకంతో కూడిన క్రికెట్ బ్యాట్‌ను జాంటీ రోడ్స్ లోకేశ్‌కు బహూకరించారు.
Login
Comments (0)