టిటిడి నూతన ఈవోగా బాధ్యతలు చేపట్టిన ముద్దాడ రవిచంద్ర
తిరుమల: నూతన టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. రంగనాయకుల మండపంలో తిరుమల తిరుపతి దేవస్థానాల 36వ ఈవోగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం భూ వరహాస్వామి, శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈవో దంపతులకు వేదపండితులు వేదాశీర్వచనం చేయగా, తీర్థప్రసాదాలు అందజేశారు. టీటీడీ బోర్డు, అనుభవజ్ఞుల సలహాలు, ఉద్యోగుల సమన్వయంతో భక్తులకు సేవలు అందించేందుకు ప్రయత్నిస్తానని ఈ సందర్బంగా రవిచంద్ర అన్నారు.
Login
Comments (0)