నేటి నుంచి మేడారం మహా జనజాతర
మేడారం :ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజనుల ఉత్సవంగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతరకు నేడు కన్నేపల్లి నుంచి అడవి బిడ్డల ఆరాధ్య దైవమైన సారలమ్మ మేడారం గద్దెల ప్రాంగణాన్ని చేరుకోవడం ద్వారా మహా జాతర ఆధ్యాత్మిక సంరంభం ఆరంభం కానుంది. జాతర తొలి అంకంలో భాగంగా బుధవారం సారలమ్మ తల్లితో పాటు వనదేవతలుగా విరాజిల్లుతున్న పగిడిద్ద రాజు, గోవిందరాజులు మేడారం గద్దెలపై కొలువుదీరను న్నారు.
ప్రకృతి, సంప్రదాయం, విశ్వాసం మిళితమై మేడారం అరణ్యం వనదేవతల ప్రతిష్ఠతో కొత్త వెలుగును ప్రకాశించనుం ది. ప్రతి రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతర మహోత్సవానికి ఇప్పటికే లక్షలాదిమంది భక్తుల రాక మొదలయ్యింది. మేడారం సమీపంలోని కన్నెపల్లి గ్రామంలోని సారలమ్మ గుడి నుంచి సంప్రదాయ పద్ధతిలో పూజారులు తల్లిని ప్రత్యేక పూజ ల అనంతరం మది నిండిన భక్తి భావంతో మేడారం తోడుకొని వచ్చి గద్దెలపై అధిష్ఠింపజేస్తారు. సారలమ్మ తల్లి రాకతో జాతర ఆరంభానికి సంకేతంగా భక్తులు భావిస్తారు.
Login
Comments (0)