మంత్రి లోకేష్ ని కలిసిన వెన్నం జ్యోతి సురేఖ
ఉండవల్లి: అంతర్జాతీయ విలువిద్య పోటీల్లో సరికొత్త చరిత్ర సృష్టిస్తోన్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన స్టార్ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ ఈ ఉదయం ఉండవల్లి నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిశారు. ప్రతిష్టాత్మక 2026 ఆసియా క్రీడలకు భారత జట్టులో ఆమె చోటు దక్కించుకున్నారు. వరుసగా నాలుగోసారి దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులతో కలిసి వెన్నం జ్యోతి సురేఖ మంత్రి నారా లోకేష్ ను కలిశారు. ఆసియా క్రీడల్లో పోటీపడే అవకాశం దక్కించుకున్న జ్యోతి సురేఖను ఈ సందర్భంగా మంత్రి లోకేష్ అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.
Login
Comments (0)