కాశీ తీర్థయాత్రకు ఐఆర్సీటీసీ ప్యాకేజీ
భారత్: కాశీ, గయ, అయోధ్య, ప్రయాగ్రాజ్ పుణ్యక్షేత్రాల సందర్శన కోసం ఐఆర్సీటీసీ ‘కాశీ తీర్థయాత్ర’ పేరుతో 9 రోజుల టూర్ ప్యాకేజీని ప్రకటించింది. సెప్టెంబర్ 9న తిరునెల్వేలి నుంచి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు బయలుదేరనుండగా, తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు గూడూరు, విజయవాడలో ఎక్కొచ్చు. ప్యాకేజీ ధర రూ.16,900 నుంచి ప్రారంభమవుతుంది. ప్రయాణం, బస, శాకాహార భోజనం, స్థానిక రవాణా, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయి.
Login
Comments (0)