డొనాల్డ్ ట్రంప్, నెతన్యాహులను హతమార్చిన వారికి రూ.560 కోట్లు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులను హతమార్చిన వారికి 58 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.560 కోట్లు) బహుమతిని ఇరాన్ ప్రభుత్వం త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ‘ఇస్లామిక్ రిపబ్లిక్ భద్రతా దళాల ప్రతిచర్య’ అనే ఈ బిల్లు ప్రకారం, అమెరికా, ఇజ్రాయెల్ అధినేతలను హత్య చేసే ఏ వ్యక్తికైనా లేదా సంస్థకైనా రూ.560 కోట్ల బహుమతిని అధికారికంగా అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఇజ్రాయెల్-అమెరికా జరిపిన దాడుల్లో అయతుల్లా ఖమేనీ ప్రాణాలు కోల్పోయిన ఘటనకు ప్రతీకారంగా ఈ బిల్లుపై ఇరాన్ పార్లమెంట్లో త్వరలో ఓటింగ్ జరపనున్నట్లు ఇబ్రహీమ్ అజీజ్ వెల్లడించారు.
Login
Comments (0)