ట్రంప్ సుంకాల కేసు: కీలకపాత్ర పోషించిన ఇండియన్ అమెరికన్ లాయర్
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ విధించిన వాణిజ్య సుంకాల్ని అమెరికా సుప్రీం కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. ఈ తీర్పు రావడంలో భారత సంతతి న్యాయవాది నీల్ కత్యాల్ కీలక పాత్ర పోషించారు. ట్రంప్ టారిఫ్‌లను వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలు చేసిన చిన్న వ్యాపారులు, డెమోక్రాట్ పాలిత రాష్ట్రాల కూటమి తరఫున ఆయన సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. కత్యాల్ షికాగోలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు భారత్ నుంచి వచ్చిన వలస వెళ్లారు. 2010లో నాటి అమెరికా అధ్యక్షుడు ఒబామా హయాంలో యూఎస్ సొలిసిటర్ జనరల్‌గా వ్యవహరించారు.
Login
Comments (0)