గుంటూరులో మహిళను వివస్త్రను చేసిన దుండగులు
గుంటూరు: నగరంలోని కృష్ణబాబుకాలనీలో మహిళను నడిరోడ్డుపై వివస్త్ర చేసి దాడికి పాల్పడిన ఘటనలో తొమ్మిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 15న నీటి మోటార్ విషయంలో జరిగిన గొడవలో మహిళపై దాడి చేసి దుస్తులు చించివేయగా, స్థానిక మహిళలు అడ్డుకుని ఆమెకు సహాయం చేశారు. ఘటనపై ఫిర్యాదు అందడంతో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో తెదేపా 21వ డివిజన్ కార్యదర్శి వెంకటరమణమూర్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
Login
Comments (0)