పదేళ్ల తర్వాత కనిపించిన ఎగిరే ఉడత
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని కార్బెట్ నేషనల్ పార్క్‌కు ఆనుకుని ఉన్న రామ్‌నగర్ అటవీ ప్రాంతంలో అరుదైన ఎగిరే ఉడత పదేళ్ల తర్వాత కనిపించింది. టేడా గ్రామంలోని ఓ ఇంట్లోకి వచ్చిన ఈ జీవిని అటవీశాఖ సిబ్బంది సురక్షితంగా రక్షించారు. కాళ్ల మధ్య ఉండే ప్రత్యేక చర్మ పొర సాయంతో ఈ ఉడత ఒక చెట్టు నుంచి మరో చెట్టుకు సుమారు 80 మీటర్ల దూరం వరకు గాల్లో తేలియాడుతూ వెళ్లగలదు.
Login
Comments (0)