పొత్తు ధర్మం పాటిస్తున్నారా?: బొలిశెట్టి సత్యనారాయణ
కూటమి ధర్మాన్ని తెలుగుదేశం పార్టీ పాటిస్తోందా అని మాజీ జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు నామినేటెడ్ పదవుల్లో జనసేనకు 30 శాతం, బీజేపీకి 10 శాతం వాటా ఉంటుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారని గుర్తు చేశారు. కూటమి భాగస్వాములతో వెంటనే చర్చలు జరిపి స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన, బీజేపీకి తగిన ప్రాధాన్యం కల్పించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు ఎక్కువ వాటా కావాలని నాదెండ్ల మనోహర్ ఇప్పటికే ప్రకటించారు.
Login
Comments (0)