అమరావతిలో భూమి కొనుగోలు చేసిన బిట్స్ పిలానీ, 2027 నుంచి అడ్మిషన్లు
అమరావతి: అమరావతిలో బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్ పిలానీ) త్వరలో తన క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. మందడం, వెంకటపాలెం గ్రామాల రెవెన్యూ పరిధిలో 70.011 ఎకరాల్లో క్యాంపస్ ఏర్పాటుకు శుక్రవారం సీఆర్డీఏతో భూ విక్రయ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఏపీ సీఆర్డీఏ ఎస్టేట్స్ విభాగ జాయింట్ డైరెక్టర్ వి.డేవిడ్ రాజు, బిట్స్ పిలానీ తరఫున అధీకృత ప్రతినిధిగా డిప్యూటీ రిజిస్ట్రార్ వి.వి.ఎస్.ఎన్.మూర్తి పాల్గొన్నారు. మొదటి దశలో రూ.1000 కోట్లతో క్యాంపస్‌ను అభివృద్ధి చేస్తారు. 2027 నుంచి విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు.
Login
Comments (0)