యోగాంధ్రలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
అమరావతి: యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా అమరావతిలోని ఉండవల్లి గుహల వద్ద యోగా గురు బాబా రామ్‌దేవ్ యోగాభ్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పతంజలి యోగా గురుకులం విద్యార్థులు ప్రదర్శించిన వివిధ యోగా ఆసనాలను సీఎం ఆసక్తిగా తిలకించారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగించిన చంద్రబాబు, ఆరోగ్యకర జీవనానికి యోగా ఎంతో అవసరమని పేర్కొన్నారు. యోగాను ప్రజల దైనందిన జీవితంలో భాగంగా మార్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
Login
Comments (0)