ఏపిలో క్వాంటం, ఏఐ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం
ఢిల్లీ: క్వాంటం, ఏఐలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను అమరావతిలో ఏర్పాటు చేసేందుకు యూనైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ కంప్యూటింగ్ సెంటర్ (UNICC)తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇక్కడ జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో సిఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అమరావతి క్వాంటం వ్యాలీలో ఈ ఏడాది చివరి నాటికి దక్షిణాదిలో ఈ తొలి ఏఐ క్వాంటం ఎక్స్ లెన్స్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో యూఎన్ఐసీసీ డైరెక్టర్ సమీర్ చౌహాన్ సహా ఆ సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు.
Login
Comments (0)