ఏపీలో క్వాంటమ్ ఫైనాన్స్ హబ్‌కు పీఎన్బీ ఒప్పందం
ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ మిషన్‌తో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్లో క్వాంటమ్ ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పీఎన్బీ ఎండీ అశోక్ చంద్ర సమక్షంలో ఎంఓయూపై సంతకాలు జరిగాయి. బ్యాంకింగ్‌లో సైబర్ భద్రత, ఆర్థిక మోసాల గుర్తింపు, ఏఐతో పాటు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై పరిశోధనలకు ఈ హబ్ వేదికగా నిలవనుంది.
Login
Comments (0)