ఏపీకి బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్ అవార్డు
రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన ఇంటర్నేషనల్ వెడ్డింగ్ అండ్ టూరిజం కాన్క్లేవ్ (ఐడబ్ల్యూటీసీ)లో ఆంధ్రప్రదేశ్‌కు 'బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్ ఎమర్జింగ్ స్టేట్' అవార్డు లభించింది. ఈ అవార్డును రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అందుకున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కు ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగానే ఈ గుర్తింపు దక్కిందని మంత్రి తెలిపారు.
Login
Comments (0)