గుంటూరు ఘటనపై పోలీసులపై చర్యలకు ఆదేశం
అమరావతి: గుంటూరులో మహిళను వివస్త్ర చేసి దాడికి పాల్పడిన ఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత జిల్లా ఎస్పీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నిందితులపై చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ వెల్లడించగా, విచారణలో నిర్లక్ష్యం వహించిన పోలీసులపైనా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. నేరస్థులను పార్టీలకు అతీతంగా కఠినంగా శిక్షించాలని, మహిళలపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.
Login
Comments (0)