శ్రీవారిని దర్శించుకున్న నటి మీనాక్షి చౌదరి
తిరుమల: శ్రీవారిని సినీ నటి మీనాక్షి చౌదరి దర్శించుకున్నారు. శుక్రవారం వేకువ జామున శ్రీవారి అభిషేక సేవలో ఆమె పాల్గొన్నారు. దర్శన అనంతరం మీనాక్షికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. గురువారం ఆమె కాలినడకన అలిపిరి మార్గం ద్వారా తిరుమల చేరుకున్నారు.
Login
Comments (0)